రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి నాగరాజు అన్నారు. సోమవారం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ. 5 వేల గౌరవ వేతనం ప్రకటించి, ఒక క్వింటాకు రూ. 300 కమిషన్ పెంచాలన్నారు.