జీరో బిల్ తో ప్రభుత్వానికి రూ. 350 కోట్ల భారం

73చూసినవారు
జీరో బిల్ తో ప్రభుత్వానికి రూ. 350 కోట్ల భారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకానికి 8. 50 లక్షల దరఖాస్తులు రాగా, ఐదు లక్షల కనెక్షన్ల వరకు ప్రస్తుతం అధికారులు జీరో బిల్‌ నమోదు చేస్తున్నారు. సాంకేతిక, ఇతర కారణాలతో కొంత మందికి అర్హత ఉన్నా ఈ పథకంలో లబ్ధి చేకూరడం లేదు. ఉమ్మడి జిల్లాలో జీరో బిల్‌ నమోదు చేయడం వల్ల రూ. 350 కోట్ల మేర ఆర్థిక భారం పడనుంది.