యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎల్. ఎన్ గార్డెన్ లో తుంగతుర్తి నియోజకవర్గ అసమ్మతి నేతల భారీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు 9 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు పైల్ల సోమిరెడ్డి, సూర్యాపేట డిసిసి ఉపాధ్యక్షులు యోగానంద చారి, కాసోజు శంకరమ్మ పాల్గొన్నారు.