
వృద్ధురాలిపై లైంగిక దాడి.. ప్రాణాలు విడిచిన అవ్వ
AP: గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. పెదనందిపాడు మండలంలో ఓ వృద్ధురాలు (65) తన కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆదివారం కుటుంబ సభ్యులు పనులకు వెళ్లడంతో వృద్ధరాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే అదనుగా భావించిన పాలపర్తి మంజూ (21) వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో ఆమె ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.