సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల వ్యాప్తంగా ఎండ తీవ్రతలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి ఎండ తీవ్రతలు గణనీయంగా మండిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ వేడి తీవ్రత తగ్గడం లేదు. మే నెల మొత్తం ఎండ తీవ్రతలు మరింత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ తీవ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.