మద్దిరాల: గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
మద్దిరాల: గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం మామిండ్లమడవలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎం. జి. ఎన్. ఆర్. ఇ. జి. ఎస్ నిధులు రూ. 20లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్