యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపినందుకు గాను రేవంత్ రెడ్డి, మందులు సామెల్ ఫోటోలకు గురువారం పాలాభిషేకం నిర్వహించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి మందుల సురేష్ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం షెడ్యూల్ కులంలో ఎన్నో పోరాటాలు నిర్వహించారు.