సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా తీగల గిరిధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం నూతనకల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు గిరిధర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మూడ్ మోహన్ నాయక్, మండల నాయకులు లావుడియా శ్రీధర్ నాయక్, గుగులోత్ రమేష్ నాయక్, వినోద్ నాయక్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.