నూతనకల్: షిఫ్ట్ డిజైర్ వాహనం ఢీ.. వృద్ధుడి మృతి

74చూసినవారు
నూతనకల్: షిఫ్ట్ డిజైర్ వాహనం ఢీ.. వృద్ధుడి మృతి
గుర్తు తెలియని కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగటి భిక్షం (80) సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చర్చి సమీపంలో గుర్తు తెలియని షిఫ్ట్ డిజైర్ వాహనం ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్