సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సమగ్ర, ఆర్థిక, కులగణన సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఈ కార్యక్రమం ద్వారా అందుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దయానంద్, కార్యదర్శి రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.