

కొండ పైనుంచి ఫల్టీ కొట్టిన కారు.. నలుగురు మృతి(వీడియో)
హిమాచల్‌ప్రదేశ్ లోని కులూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రోహ్తాంగ్ పాస్ వద్ద రహ్నీనలా సమీపంలోని పర్వతం పైనుంచి కారు అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా, అందులోని నలుగురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.