సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాదరబోయిన రవి, ఉపాధ్యక్షుడిగా పుల్లూరి రమేష్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల మహేష్, కోశాధికారిగా ఐతరాజు అంజయ్య ఎన్నికయ్యారు. రవి, రమేష్, మహేష్, రాజు, అంజయ్య మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.