కేటీఆర్ సవాల్ ను స్వీకరించాలంటే వాళ్ళ అయ్యా కేసీఆర్ రావలసిన అవసరం ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు. కేటీఆర్ సూచించినట్లు ఏ సెంటర్ అవసరం లేదని అసెంబ్లీలో చర్చ పెడదామని అన్నారు. ప్రచార ఆర్భాటాల కోసం మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేస్తున్నాడని ఆయన అన్నారు.