సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మంగళవారం కంప్లైంట్ ఇచ్చారు. లిక్కర్ దందా చేస్తున్నానట్టు అసత్య ఆరోపణలు తనపై చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని నిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పాల్గొన్నారు.