సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సమ్మెలు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన రైతుల పక్షాన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి అన్నారు. భూభారతి తో రైతుల కష్టాలు తీరుతాయన్నారు.