తుంగతుర్తి: స్వయంగా కారు నడిపిన ఎమ్మెల్యే మందుల సామేలు

68చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కామ్రేడ్ మారోజు వీరన్న 26వ వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేలు మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వల్లపు రమేష్ నూతనంగా కొనుగోలు చేసిన షిఫ్ట్ కారును నడిపి ప్రారంభించారు. వల్లపు రమేష్ కు ఎమ్మెల్యే సామేలు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్