తుంగతుర్తి: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి

63చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు బుధవారం డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ప్రజా సమస్యలపై సీపీఎం పోరుబాట కార్యక్రమంలో ప్రజా సమస్యలపై సర్వే చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్