రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసినందుకు తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం తుంగతుర్తిలో ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాట తప్పక అమలు చేసిందన్నారు. 59 ఉపకులాలుగా ఉన్న మాదిగలను మూడు గ్రూపులుగా విభజించి అమలు చేసిన కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు.