తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ నెల 19న చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకులు ఉప్పుల మల్లయ్య యాదవ్ కోరారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న తుంగతుర్తి మండలం కొత్తగూడెంలోని దళిత బహుజన నాయకుడు మారోజు వీరన్న స్మారక స్థూపం వద్ద నుంచి హైదరాబాద్ వరకు చేపట్టే పాదయాత్రలో ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొనాలని కోరారు.