యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

50చూసినవారు
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనార్థమై భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్