భర్త అనుమానిస్తున్నాడని.. కొడుకుతో కలిసి చంపేసింది

55చూసినవారు
భర్త అనుమానిస్తున్నాడని.. కొడుకుతో కలిసి చంపేసింది
అనుమానంతో వేధిస్తున్నాడని భార్య భర్తనే చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట(D) మద్దూరు(M) రేబర్తికి చెందిన పరమేశ్వర్‌(40), భారతి దంపతులు HYD నగరానికి వలసొచ్చి జీవిస్తున్నారు. పరమేశ్వర్‌ నిత్యం భార్యను అనుమానిస్తూ.. వేధించడంతో విసిగిపోయిన భారతి కుమారుడితో కలిసి భర్తను ఎలక్ట్రిక్‌ ఇస్త్రీ పెట్టెతో తలపై బలంగా కొట్టి, వైరును మెడకు బిగించి చంపింది. కుమార్తెకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరమేశ్వర్‌ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక విషయం బంధువులకు చెప్పడంతో దారుణం బయటపడింది.

సంబంధిత పోస్ట్