అనుమానం.. భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త

51చూసినవారు
అనుమానం.. భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త
AP: బాపట్ల జిల్లా, జమ్ములపాలెంలో సోమవారం దారుణ ఘటన జరిగింది. హరీష్‌ అనే వ్యక్తి తన భార్య సుభాషిణి(27)ని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్