హైదరాబాద్‌లో వృద్ధుడి అనుమానస్పద మృతి (వీడియో)

52చూసినవారు
హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లోని మేఫ్లవర్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విద్యాసాగర్(61) అనే వృద్ధుడు గురువారం ఉదయం అపార్ట్‌మెంట్‌పై నుంచి పడిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్