బత్తాయి జ్యూస్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బత్తాయి పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫైబర్ తోపాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. బత్తాయి జ్యూస్ తాగడం వల్ల నీరసం, తలనొప్పి వంటి లక్షణాల నుంచి ఉపశమనం వస్తుంది. ఇంకా చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.