బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపానికి సరైన మొక్కల్లో చిగుర్లు వివృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండాపు కణపు మీద ఉంటాయి. దీనివల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ముడుచుకొని ఉంటాయి.