అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం పశ్చిమాసియా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌తో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అబు మహ్మద్ అల్ జులానీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డమాస్కస్‌పై ఉన్న ఆంక్షలను ట్రంప్ తొలగించింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్‌లో సంబరాలు చేసుకొంటున్నారు. సిరియా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్‌కు గతంలో ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలున్నా.. ఆయనను ట్రంప్ కలవడం గమనార్హం.