TG: జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్‌గా టీ కిషన్ కుమార్ రెడ్డి మంగళవారం నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా కిషన్ కుమార్ రెడ్డికి యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.