ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్‌ఐఏ భవనంలో రాణాను ఉంచి.. అక్కడ నిరంతర నిఘా ఏర్పాటు చేసి అతడి కదలికలను NIA అధికారులు గమనిస్తున్నారు. ఎన్‌ఐఏ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గదిలో రాణాను ఉంచారు. 14 X 14 అడుగుల వైశాల్యంలో ఒక చిన్న గదిలో అతడు పడుకోవడానికి నేలపై బెడ్ వేశారు. 24 గంటల నిఘా కోసం సీసీ కెమెరాలు అమర్చారు.