యాదగిరిగుట్ట జిల్లా రాజాపేట మండల తహశీల్దార్‌కే దుండగుడు కుచ్చుటోపీ పెట్టాడు. ఎమ్మార్వోకు ఫోన్ చేసి తాను ఏసీబీ అధికారిని అని నమ్మించాడు. అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయని, పట్టుకొని జైల్లో పెడతానని బెదిరించాడు. దీంతో ఎమ్మార్వో భయపడి రూ. 3.30 లక్షలు అతడి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.