మీ యువరాణి జాగ్రత్త!

64చూసినవారు
మీ యువరాణి జాగ్రత్త!
ఒక్కరే సంతానం అని గారాబం ఎక్కువ చేస్తున్నారా? దీనివల్ల చిన్నారుల్లో స్వతంత్ర భావాలు కొరవడుతున్నాయంటారు నిపుణులు. అమ్మాయిలకైతే మరీ ఎక్కువ! దీనినే ‘ప్రిన్సెస్ సిండ్రోమ్’ అంటారు. ఈ గారాబం ఇంటి వరకు అయితే పర్లేదు.. సమాజంలో ఎదగాలంటే? కాబట్టి తను కోరుకునే ప్రతిదీ రావడం వెనక ఉన్న కష్టమేంటో చెప్పండి. సవాళ్లను ఎదుర్కోనీయండి. కెరీర్, స్నేహితులను ఏర్పరచుకోవడం వంటివాటిల్లో స్వీయ నిర్ణయాలు తీసుకోనివ్వండి. అన్నీ వేళలా వేలు పట్టుకుని నడిపించొద్దు అంతే!

సంబంధిత పోస్ట్