గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో రన్‌వే 23 నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే ఏటీసీకి విమాన సిబ్బంది ‘మేడే’ కాల్ చేశారు. ఏటీసీ తిరిగి సంప్రదించేందుకు యత్నించగా స్పందన కరవైంది. అంతలోనే ఘోరం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం ప్రధాన పైలట్ సుమిత్ సభర్వాల్‌కు 8200 గంటల ఫ్లైయింగ్ అవర్స్ అనుభవం ఉంది. కోపైలట్‌కు 1100 గంటల ఫ్లైయింగ్ అవర్స్ అనుభవం ఉందని డీజీసీఏ వెల్లడించింది.