తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీని ఊచకోత కోశారు. ముప్పై మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లు పాక్ తాలిబాన్లు (తెహ్రీక్-ఇ-తాలిబాన్) శుక్రవారం రాత్రి ప్రకటించారు. పాకిస్తాన్‌ని ఓ వైపు భారత్, మరో వైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఇ తాలిబాన్(టీటీపీ) దెబ్బకొడుతున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనేది పాక్‌లోని ఒక తీవ్రవాద సంస్థ, ఇది 2007లో ఏర్పడింది.