తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రంతో ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదివారం జరిగిన మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తెలుగులో ఎంతో అద్భుతంగా మాట్లాడాడు. ‘మనం నిత్యం ఏదో ఒక విషయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాంటివారికి దగ్గరైన సినిమాగా మా డ్రాగన్ ఉంటుంది’ అని తెలిపాడు.