చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ నటుడు విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. 'ధోనీ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు' అని విష్ణు విశాల్ శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐపీఎల్ 2025లో భాగంగా KKRతో జరిగిన మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోనీ 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు.