బాక్సాఫీస్ వద్ద 'తండేల్' కలెక్షన్ల సునామీ

52చూసినవారు
బాక్సాఫీస్ వద్ద 'తండేల్' కలెక్షన్ల సునామీ
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లోనే రూ.86 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ గురువారం 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు. కాగా, ఈరోజు సాయంత్రం శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియంలో చిత్రబృందం థాంక్యూ మీట్ నిర్వహించనుంది.

సంబంధిత పోస్ట్