ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా టెలికాస్ట్.. ఛైర్మన్ కీలక ప్రకటన

62చూసినవారు
ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా టెలికాస్ట్.. ఛైర్మన్ కీలక ప్రకటన
మొన్నామధ్య గేమ్ ఛేంజర్ సినిమాను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం మరవక ముందే.. తండేల్ సినిమాను బస్సులో ప్లే చేయడం పెను సంచలనంగా మారింది. ఈ క్రమంలో తండేల్ సినిమా పైరసీ ప్రింట్ టెలికాస్ట్ చేసిన బస్సును సర్వీసు నుంచి తొలగించామని APSRTC చైర్మన్ నారాయణ వెల్లడించారు. 'పైరసీని ఆర్టీసీ సంస్థ ప్రోత్సహించదు. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం' అని నారాయణ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్