దీపావళిలోగా కుంభకోణాల టపాసు పేలుతుందని మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని చెప్పారు. ధరణి పోర్టల్, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారని ఆరోపించారు. ఈ కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోగా టపాసులాగా పేలుతుందన్నారు. అరెస్టు చేయాలా? జీవితకాలం జైలులో పెట్టాలా? అనేది చట్టం చూసుకుంటుందని తెలిపారు. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందని చెప్పారు.