టాటా సఫారీ, హారియెర్‌లకు భారత్‌-ఎన్‌క్యాప్ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

71చూసినవారు
టాటా సఫారీ, హారియెర్‌లకు భారత్‌-ఎన్‌క్యాప్ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌
భారత్‌ న్యూ కార్‌ అసెస్మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద పెద్దలు, పిల్లల రక్షణ విషయంలో టాటా మోటార్స్‌కు చెందిన ఎస్‌యూవీలు సఫారీ, హారియెర్‌లు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందాయి. దేశంలో తిరిగే వాహనాలను ప్రపంచ శ్రేణి ప్రమాణాలకు దీటుగా నిలిపేందుకు వీలుగా భారత్‌-ఎన్‌క్యాప్ ను గత ఆగస్టులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సఫారీ, హారియెర్‌ భారత్‌-ఎన్‌క్యాప్ కింద సర్టిఫై కావడం పట్ల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి ఆ కంపెనీని అభినందించారు.