విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. '1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారుచేశాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాను." అని సీఎం అన్నారు.