మొట్టమొదటి సారి దళిత వ్యక్తిని స్పీకర్‌గా చేసిన ఘనత టీడీపీది అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. గతంలో మొదటి దళిత స్పీకర్‌గా బాలయోగి, దళిత మహిళ ప్రతిభా భారతిని స్పీకర్‌గా చేశామని గుర్తుచేశారు. రాష్ట్రపతులైన కేఆర్ నారాయణన్, కలాం, కోవింద్, ముర్ముల ఎన్నికల్లో టీడీపీ భాగస్వామ్యంగా ఉండటం గర్వ కారణమని అన్నారు. కాకి మాధవరావును సీఎస్, ఎన్నికల అధికారిగా నియమించినట్లు చెప్పారు.