అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల విషయంలో టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఏలూరులోని సాక్షి జిల్లా ప్రధాన కార్యాలయానికి నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పట్టపగలు పత్రిక కార్యాలయంపై టీడీపీ నేతలు దాడులు చేయడం దుర్మార్గమని, తాము భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.