స్టార్ సింగర్ మంగ్లీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 4న రథసప్తమికి అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఐపీ దర్శనం కల్పించారు. వైసీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆమెకు ప్రత్యేక దర్శనం కావాల్సి వచ్చిందా? అని కేడర్ ఫైర్ అవుతోంది. ‘ఫ్యాన్‌కు ఓటేస్తే ఐదేళ్లు చల్లగా ఉంటాం’ అని మంగ్లీ ప్రచారం చేసిన వీడియో Xలో వైరల్ అవుతోంది.