పెన్సిల్ కోసం టీచర్, తోటి విద్యార్థిపై దాడి (VIDEO)

84చూసినవారు
తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని పాళయంకోటైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. పెన్సిల్ కోసం 8వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. దీంతో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కొడవలితో దాడి చేశాడు. ఆపడానికి వచ్చిన టీచర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో గాయపడిన టీచర్, విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్