సహాయం కోరిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడో కీచక టీచర్. తమిళనాడులోని తంజావూరులో స్కూల్ హెడ్ మాస్టర్ తాను పాఠాలు చెప్పే గురువునని మర్చిపోయి కుటుంబ సమస్యకు సహాయం కోరిన మహిళను లైంగికంగా వేధించాడు. తనకు 60 ఏళ్ల వయసని మరిచి కామంతో కళ్ళు మూసుకుపోయి సదరు మహిళను హగ్ చేసుకున్నాడు. 'అయ్యో సార్ వదిలేయండి' అని ఆమె ప్రాధేయపడినా దుష్టుడు కనికరించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలపుతోంది.