ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ అద్భుత విజయంతో ముగించింది. నేడు అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 142 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 356 రన్స్ చేయగా 357 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినా ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బ్యాంటన్ (38), అట్కిన్ సన్ (38) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఇండియా ఘన విజయం సాధించింది.