తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన బ్రిటన్‌కు చెందిన ఎఫ్–35బీ యుద్ధవిమానానికి మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక పరికరాలతో యూకే ఏవియేషన్ ఇంజినీర్ల బృందం ఆదివారం A400M విమానంలో కేరళకు చేరింది. ప్రస్తుతం హ్యాంగర్‌కు తరలించి మరమ్మతులు చేస్తున్నారు. అనంతరం C-17 గ్లోబ్‌మాస్టర్ ద్వారా తరలించే యోచనలో ఉన్నారు.