TG: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్ నెంబర్ SG-2138లో పొగలు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానంలో కాలిన వాసన రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు. దీంతో మూడు గంటలుగా ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు పడుతున్నారు. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తరువాత పలు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతుండడం గమనార్హం.