తిరుమలలోని గోవింద నిలయం అతిథిగృహంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గోవిందసాయి అతిథిగృహంలో విద్యుత్ అంతరాయంతో లిఫ్ట్ పనిచేయక.. ఐదుగురు భక్తులు 10 నిమిషాలపాటు అందులో ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు. 30 నిమిషాల తర్వాత టెక్నీషియన్ రాకతో లిఫ్ట్ తెరిచి, భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాతల నిర్వహణలో ఉన్న ఈ అతిథిగృహంలో సిబ్బంది సకాలంలో స్పందించలేదని భక్తులు ఆరోపించారు.