TG: తనకు పార్టీ నోటీసులు ఇచ్చిందన్న వార్తలపై కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న స్పందించారు. 'నాకు ఇంకా షోకాజ్ నోటీసులు రాలేదు. వచ్చినా భయపడేది లేదు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడు. కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికీ నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకివ్వాలి. అధిష్ఠానం ఆదేశాల్ని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక' అని ఆరోపించారు.