TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ సమావేశం జరుగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరడం హాస్యాస్పదమని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమావేశాలు వాయిదా వేయటాన్ని తప్పుపట్టారు.